‘ఆర్ ఎక్స్ 100’ విజయంతో మెరుపులా దూసుకొచ్చిన పాయల్ రాజ్ పుత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులు దొచింది. కానీ అటుపై నటించిన సినిమాలేవి పాయల్ ని స్టార్ గా నిలబెట్టలేకపోయాయి. చివరకు ‘మంగళవారం’ చిత్రంలో కూడా అజయ్ భూపతి అలాగే అవకాశం కల్పించాడు.
అతడే హీరోయిన్ గా పరిచయం చేయడంతో అదే చనువుతో అడగం..ఆయన కాదనలేకపోవడం..ఆ సినిమా మంచి విజయం సాధించడం అన్నీ జరిగిపో యాయి.మంగళవారం సినిమాలో కాస్త హద్దు దాటి నటించినా! నటిగా మార్కలు వేయించుకుంది తప్ప…కొత్త ఛాన్సులకు మాత్రం ఆ సినిమా మార్గాన్ని చూపలేదు. అయినా పాయల్ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు .తొలిసారి కెరీర్ లో మొదటి కెమెరా ముందుకొచ్చి ఫోజులిచ్చిన ఫోటో షూట్ ని అభిమానులతో పంచుకుంది.
ఆ పాత సంగతులు గుర్తు చేసుకుని మురిసిపోయింది. 21 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చిందిట. ఇదే నా తొలి ఫోటో షూట్ అంటూ సిగ్గుపడిపోయింది. ఓ మ్యాగజైన్ కోసం పాయల్ ఈ షూట్లో పాల్గొన్నట్లు తెలిపింది. ఆరేంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో కనిపిస్తుంది. అయితే పాయల్ అందం విషయంలో పెద్ద మార్పులేమి కనిపించలేదు. అప్పుడెలా ఉందో? ఇప్పటికీ అలాగే ఉంది. ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేరింగ్ తీసుకుంటుందని తెలుస్తోంది. 31 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తోంది.