నటుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ -టైనర్ ‘రుద్రుడు’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శరత్‌కుమార్ కీలక పాత్రధారి. ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో లారెన్స్ మాస్టర్ వేదికపై డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ”రుద్రుడు కథని దర్శకుడు కతిరేసన్ చాలా అద్భుతంగా చెప్పారు. అందులో మదర్ సెంటిమెంట్ నా మనసుని చాలా ఆకట్టు-కుంది. రుద్రుడులో ఫ్యామిలీ , మాస్, యాక్షన్, డ్యాన్స్ అన్నీ వుంటాయి. శివ మాస్టర్ చాలా మంచి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మధు గారు ఈ సినిమా తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ చాలా చక్కగా చేసింది. ఒక హీరోగా నేను బావుండాలి అనే కంటే మనిషిగా నేను బావుండాలని, నా సినిమాలన్నీ విజయాలు సాధించాలని మీరు కోరుకోవడం చాలా ఆనందంగా వుంది. ”అన్నారు.
ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ ”రుద్రుడు సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది.” అన్నారు.
అతిథులుగా విచ్చేసిన బివిఎస్ఎన్ ప్రసాద్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, దామోదర్ ప్రసాద్, సోహెల్ రుద్రుడు టీ-ంఅందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు