రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్..పాన్ ఇండియా మూవీగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై అంచనాలున్నాయి. 400 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా ముగింపు దశలో ఉన్నాయేగానీ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసే పరిస్థితి లేదు. అందువలన విడుదల తేదీని వాయిదా వేసే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను దసరాకి కాకుండా .. ‘సంక్రాంతి’ కి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి కరోనా పెద్ద సినిమాలతో దోబూచులాడుతోంది. ఏ విషయంలోనూ ఎటూ తేల్చుకోనీయకుండా చేస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement