Saturday, November 23, 2024

హైదరాబాద్ వీధుల్లో సందడి చేసిన ఒలీవియా మోరీస్‌..

పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టింది. ఈ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ముగియడంతో ఈ అమ్మడు సిటీలో ప్రత్యేక్షమైంది.

సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ కనిపించింది. ఆమె వెంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డి కూడా వుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. కొన్నిచోట్ల ఎవరు ఆమెను గుర్తించి, గుర్తించకపోవడంతో నవ్వులు పూయించింది.

బహుబలి తర్వాత జక్కన్న తీస్తున్న మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ గా అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ – చరణ్ నటిస్తుండటంతో ఆ అంచనాలు తరాా స్థాయికి చేరుకున్నాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీపై త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ సరసన ఆలియాభట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరీస్‌ నటిస్తుంది.

ఇది కూడా చదవండి: ‘పుష్ప’ నుంచి బిగ్ అప్‌డేట్.. భయపెడుతున్న విలన్ లుక్

Advertisement

తాజా వార్తలు

Advertisement