Friday, September 20, 2024

Ruhani sharma | ‘ఆగ్రా’ బోల్డ్ సీన్లపై రుహానీ క్లారిటీ..

‘చిలసౌ’ అనే తెలుగు సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీని తర్వాత టాలీవుడ్‌లో అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. అయితే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆగ్రా’ అనే హిందీ సినిమా గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.

‘ఆగ్రా’ సినిమాలో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటంతో మన దగ్గర స్ట్రీమింగ్‌లోకి రాలేదు. కానీ పైరసీ సైట్లలో కనిపించింది. దీంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చూసి షాకయ్యారు. రుహానీ శర్మ ఇలా చేసిందేంటి అని ఆమెని విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఈమె వరకు వెళ్లడంతో స్పందించింది. పెద్ద నోట్ రిలీజ్ చేసింది.

”అందరికీ హాయ్. నేను నటించిన ‘ఆగ్రా’ సినిమా లీక్ అయింది. నెలల తరబడి మేం పడ్డ కష్టం ఇలా వృథా అవుతుందనుకోలేదు. అప్పటి నుంచి ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా అసంతృప్తికి గురయ్యాను. ఆర్ట్ ఫిల్మ్ తీయడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు ఉంటాయి. ఇవేవి చూడకుండా నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం, నన్ను జడ్జ్ చేయడం నిజంగా దారుణం.

‘ఆగ్రా’ సినిమా గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. నటిగా ఇది నాకెంతో గర్వ కారణమైన విషయం. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని, అవార్డులు పొందిన ఈ చిత్రం విషమయై నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ గురించి మీకేం తెలియకపోతే ఏది పడితే అనొద్దు. కాస్త గౌరవమిచ్చి మాట్లాడండి. అవసరమైతే ప్రోత్సాహించండి కానీ మేం పడ్డ శ్రమని తక్కువ చేసి చూడొచ్చు’ అని రుహానీ శర్మ భావోద్వేగానికి లోనైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement