Saturday, November 23, 2024

సుశాంత్ ని తలుచుకుని రియా ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత ఏడాది జూన్ 14 ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని తన సొంత నివాసంలో ఉరివేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ జూన్ 14 కి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడి ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో అతనిని తలుచుకుంటూ.. పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే అక్కడే ఉండు… ప్రేమతో రియా అంటూ చెప్పుకొచ్చింది రియా.

https://www.instagram.com/p/CPYYxumHXLW/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement