హీరోయిన్ రీతూ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా రీతువర్మ పరిచయం అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి ఈ అమ్మడికి. అయితే ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు నటించిన టక్ జగదీష్ ,వరుడు కావలెను సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాల్లో నటించడమే తనకు ఎంతో ఇష్టమని క్లారిటీ ఇచ్చింది రీతూ.