రాజమౌళి తన X హ్యాండిల్ లో దర్శకధీరుడు రాజమౌళి ఇలా రాసారు. ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థిరమైన వ్యాపారం, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధిని కల్పించి ఎందరికో జీవన మార్గంలో ఆశను పెంపొందించారు.. రామోజీ రావు గారికి మనం నివాళులర్పించే ఏకైక మార్గంభారతరత్న ప్రదానం చేయడం` అని ట్విట్ చేశారు.
అశ్వని దత్….
ఏ రంగంలో అయినా ఎలాంటి నేపథ్యం లేకపోయినా కష్టపడితే విజయం దక్కుతుందనే స్ఫూర్తిని పంచిపెట్టిన రామోజీ రావు జన్మ ధన్యమని నిర్మాత అశ్వనీదత్ ట్వీట్ చేశారు. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు అని తెలిపారు.
రామ్ గోపాల వర్మ..
రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. రామోజీ రావు మరణం నమ్మశక్యం కాదని, ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక సంస్థగా రూపాంతరం చెందారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన మనిషి కాదని, శక్తి అని కొనియాడారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు.