పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలు సహా పలువురు అభిమానులు అకీరాకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. అయితే పవన్ ఫ్యాన్స్ కొందరు హద్దు దాటి కామెంట్స్ చేయడంతో రేణు దేశాయ్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.. అకీరా పుట్టినరో్జు సందర్భంగా ఒక నెటిజన్ . “మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్నకొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి.అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లలో అకీరా బాబును చూపించండి” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ..’మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలావరకు ఇలాంటి కామెంట్స్‌ను డిలీట్ చేస్తూ వస్తున్నాను. కానీ కొందరు హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయాను’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement