కరోనా సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హాస్పిటల్‌లో బెడ్స్ దొరక్క పోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో ఇబ్బందులు ఉన్నవారికి నటి రేణూ దేశాయ్ తన వంతు సాయం చేస్తానంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడిన రేణు కోవిడ్ బాధితులను చూస్తే బాధేస్తుందని తెలిపింది. ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను’ అన్నారు. ఇది మంచికే ఉపయోగపడుతుందని భావిస్తున్న అంటూ రేణు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement