Friday, November 22, 2024

ఆరాధ్య‌పై ఫేక్ న్యూస్ తొల‌గించండి – యూట్యూబ్ కి హైకోర్టు ఆదేశం..

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌నువ‌రాలు ఆరాధ్య బ‌చ్చ‌న్ పై యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న అన్నిఫేక్ న్యూస్ వీడియోల‌ను త‌క్ష‌ణం తొల‌గించాలని ఢిల్లీ హైకోర్టు నేడు యూట్యూబ్ ను ఆదేశించింది. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్‌ను హెచ్చ‌రించింది. వివ‌రాల‌లోకి వెళితే యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ గా కొన్ని ఛాన‌ల్స్ ఆరాధ్య ఆరోగ్యం పై తప్పుడు క‌థ‌నాల‌ను వండివార్చాయి.. దీనిపై . దీంతో ఆరాధ్య త‌ల్లి ఐశ్వ‌ర్య రాయ్‌ బ‌చ్చ‌న్ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన‌ ఢిల్లీ హైకోర్టు ఇవాళ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

త‌క్ష‌ణ‌మే త‌మ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్త‌ల‌ను తొల‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. . కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిల‌దీసింది. త‌ప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయ‌కుండా ఉండే పాల‌సీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు యూట్యూబ్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వ‌ర్య వేసిన పిటిష‌న్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఐటీ రూల్స్ ప్ర‌కారం త‌మ పాల‌సీల‌ను మార్చుకున్నారా లేదా అని ప్ర‌శ్నించింది. ప్ర‌తి చిన్నారికి గౌర‌వంగా, మ‌ర్యాద‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటువంటి వార్త‌లు ఇతరుత‌ల‌పైనా ప్ర‌సారం చేసిన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement