బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2017లో షారూఖ్‌ఖాన్ నటించిన సినిమా రేస్ సినిమా ప్రమోషన్ కోసం ముంబై నుండి ఢిల్లిdకి రైలులో బయలుదేరారు. గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్ చేరుకున్న షారుఖ్ అభిమానులకు అభివాదం తెలుపుతూ.. తన టీషర్టును జనంలోకి ఎగరేయడంతో భారీ జనసందోహం మధ్య తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు కారణమైన షారూఖ్‌పై కాంగ్రెస్ నేత జితేందర్ మధుభాయ్ సోలంకి ఫిర్యాదు చేశాడు. దీంతో వడోదర స్థానిక కోర్టు తొక్కిసలాటకు కారణమైన షారూఖ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
దీనిపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన షారూఖ్.. తొక్కిసలాటకు షారూఖ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ కేసును కొట్టివేసింది. మరోసారి పిటిషనర్ సోలంకి సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ అజయ్ రస్తోగి, రవికుమార్‌ల బెంచ్ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. కేసును డిస్మిస్ చేసింది. పిటిషనర్‌కు ప్రత్యక్షంగా ఘటనపై ప్రమేయం లేదని పేర్కొంది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది విజయ్‌కుమార్, ఖాన్‌లు వాదనలు వినిపించారు. దీనికి సీనియర్ న్యయవాది సిద్ధార్థ్ లూథ్రా నేతృత్వంలో అడ్వకేట్ రూబీసింగ్ అహూజా బృందం వివరణ ఇచ్చింది.