ఓటీటీ, ఆన్లైన్ స్ట్రీమింగ్ రంగంలోకి రిలయన్స్ అడుగుపెట్టనుంది. ఈమేరకు బోధీ ట్రీతో టైఅప్ అయినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకాం-18 ప్రకటించాయి. జేమ్స్ మర్డోచ్ లుపా సిస్టమ్స్ ఉదయ్‌శంకర్ ప్లాట్‌ఫాం బోధీ ట్రీ సిస్టమ్స్..వయాకాం-18లో కన్సార్టియం ద్వారా రూ.13,500కోట్లు నిధులు సేకరించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంయుక్తంగా దేశంలో అగ్రశ్రేణి ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కాగా వయాకాం-18 టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్వహించనుంది.రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ప్రొజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ ఇప్పటికే టెలివిజన్, ఓటీటీ, డిస్ట్రిబ్యూషన్, కంటెంట్ క్రియేషన్, ప్రొడక్షన్ కార్యకలాపాలను గణనీయంగా నిర్వహిస్తుంది. జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకాం-18కి బదిలీ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..