Sunday, September 8, 2024

Ravi Teja | ‘విక్రమార్కుడు’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌లో మాస్ మహారాజా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ కూడా చేరింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘విక్రమార్కుడు’.. సినిమాని 18 ఏళ్ల తర్వాత తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల (జులై) 27న మరో సారి థియేటర్లలోకి సందడి చేయనుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4కే రిజల్యూషన్‌తో థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలను హీరోల బర్త్ డే స్పెషల్, మరేదైనా ప్రత్యేక రోజులలో రీ–రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లో మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా చేరడంతో ఈ సినిమాని 4కె వెర్షన్‌లో థియేటర్లలో చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement