మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రా న్ని అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. ఇందులో నటుడు సుశాంత్ కీలక పాత్ర పోషిం చారు. ఈ నేపథ్యంలో సుశాంత్ రావణాసుర చిత్ర విశేషాలని మీడి యాతో పంచుకున్నారు.
రావణాసుర కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
కథ విన్నపుడు మాత్రం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకు డిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటు-ంది.
రవితేజ గారితో కాంబినేషన్ సీన్ల్ ఎలా వుంటాయి ?
అవి చాలా ఆసక్తికరంగా వుం టాయి. రవితేజ గారిని కొత్తగా చూపించారు. నన్ను కొత్తగా చూ పించారు.
నిర్మాత అభిషేక్ గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?
అభిషేక్ గారితో గ్రేట్ జర్నీ. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రని నన్ను తీసుకొ వాలనే ఆలోచన కూడా ఆయనిదే. ఈ సందర్భంగా అభిషేక్ గారికి కృతజ్ఞతలు.
ఇందులో మీ పాత్ర నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారని భావిస్తున్నారు ?
రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్ మెంట్ వుంది. చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు చూడలేదు.
మీరు సినిమాలు చాలా సెలెక్టివ్ గా.. గ్యాప్ తీసుకొని చేస్తున్నారని అనిపిస్తుంది?
అక్కినేని కుటు-ంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకా శా లతోనే ముందుకు వెళ్లాను. గ్యాప్ ఎందుకు వస్తుందని కొన్ని సార్లు నాకే తెలియలేదు. చిలసౌ తర్వాత ఇక గ్యాప్ తీసుకో కూడదని అని బలంగా నిర్ణయించుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటు-న్నా.