ప్రస్తుతం ఇండస్ట్రీలో రీమేక్ లకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని అక్కడ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ రీమేక్ లనే నమ్ముకున్నారు. లూసిఫర్ రీమేక్ మెగాస్టార్ చేస్తుండగా, అసురన్ రీమేక్ ను వెంకీ చేస్తున్నాడు. అలాగే పింక్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి మాస్ మహారాజా రవితేజ కూడా చేరినట్లు తెలుస్తోంది.
మలయాళ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ ను హీరోగా పెట్టి చరణ్ నిర్మించాలని చూస్తున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో హీరో కూడా అవసరమున్నాడట. అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే ఇది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదట. ఇక దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రాక్ సినిమాతో హిట్ ను అందుకున్న రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.