బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు కాస్త ఊరట లభించింది. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం హేమ పరప్పన అగ్రహార జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ మంజూరైనప్పటికీ నటి హేమ ఈరోజు విడుదల కావడం లేదు.
బెయిల్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. కాగా, బెయిల్ పిటిషన్‌పై నేజు విచారణ సందర్భంగా హేమ తరఫున న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. తన క్లయింట్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టుకు తెలిపాడు.