Tuesday, November 26, 2024

రావ‌ణ‌సుర మామూలుగా ఉండ‌దు..

మాస్‌ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకుడు. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ- టీ-మ్‌ వర్క్స్‌పై అభిషేక్‌ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ నెల 7న సమ్మర్‌ స్పెషల్‌గా సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.
ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌.. దర్శకుడితో మాంచి సింక్‌లో వుండి ప్రతి సెట్‌ చాలా అద్బుతంగా వేశారు. డీవోపీ విజయ్‌ కన్నన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. రెండు పాటలు చేసిన జికే విష్ణు, దివాకర్‌ మణి, ప్రసాద్‌ మురెళ్ళకి థాంక్స్‌. వెంకట్‌, శివ ఫైట్స్‌ ఇరగదీశారు. మా డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఈ సినిమా మ్యూజిక్‌ కి స్పెషల్‌ ఎప్పీయరెన్స్‌ భీమ్స్‌. నాకు ఇష్టమైన -టె-క్నీషియన్‌. ఈ సినిమాకి హర్షవర్ధన్‌.. అద్భుతమైన సౌండ్‌ ఇచ్చాడు. మీ అందరూ ఎంజాయ్‌ చేస్తారు. రైటర్‌ శ్రీకాంత్‌ ఈ సినిమాతో నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్ళాలి. తనతో -టైగర్‌ నాగేశ్వర్‌ చేస్తున్నాను. మేఘా, దక్ష, పూజిత, అను, ఫరియా.. హీరోయిన్స్‌ అంతా బాగా నటించారు. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్‌ 7న విజల్స్‌ పడతాయి. సుధీర్‌ వర్మ నాకు ఇష్టమైన డైరెక్టర్‌. చాలా స్వీట్‌ అండ్‌ పాజిటివ్‌ పర్శన్‌. సుధీర్‌ ఈ సినిమాతో నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్లాలని కోరుకుంటు-న్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ఏప్రిల్‌ 7 థియేటర్స్‌లో ఇరగదీసేద్దాం. మాములుగా వుండదు. సౌండ్‌ దద్దరిల్లుతుంది. ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు. జై సినిమా” అన్నారు.


దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ.. అద్భుతమైన కథ. ఇంత మంచి కథ డైరెక్ట్‌ చేయడానికి నన్ను ఎంచుకోవడం అనందంగా వుంది. హీరోయిన్స్‌ అందరూ అద్భుతంగా చేశారు. రవితేజగారు ఎప్పుడూ ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్‌ అవుతారు, షాక్‌ అవుతారు’ అని తెలిపారు.
నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా వుంది. ఏప్రిల్‌ 7 తర్వాత.. ఇక్కడే యాభై రోజుల పండగ చేసి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం” అన్నారు. ఈ కార్యక్రమంలో నటు-డు సుశాంత్‌, సంగీత దర్శకులు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో, పూజిత, దక్ష, మేఘా ఆకాష్‌, ఎస్కేఎన్‌, వంశీ, సురేష్‌ బాబు, గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, వివేక్‌ కూచిభొట్ల, హైపర్‌ ఆది, శ్రీకాంత్‌ విస్సా, కాసర్ల శ్యామ్‌ తదితరులు చిత్ర విజయాన్నికాంక్షిస్తూ ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement