Tuesday, November 26, 2024

రావ‌ణ‌సుర న‌న్ను మ‌రో మెట్టు ఎక్కిస్తుంది – హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణా సుర ఈ వారం ప్రేక్షకుల ముందుకురానుంది. ధమాక సక్సెస్‌ తర్వాత రవితేజ నటించగా రిలీజ్‌ అవుతున్న సినిమా ఇది. సుధీర్‌ వర్మ దర్శకుడు. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మీడియా సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

రావణాసుర జర్నీ ఎలా స్టార్ట్‌ అయ్యింది ?
అభిషేక్‌ గారి ప్రొడక్షన్‌లో డెవిల్‌ సినిమా చేస్తు న్నాను. ఒకరోజు రావణాసురకు థీమ్‌ సాంగ్‌ కావా లంటే ఒక ట్యూన్‌ చేసి పంపించాను. కొన్ని రోజులు తర్వాత అభిషేక్‌ గారు, సుధీర్‌ వర్మ వచ్చి రావణాసు రకి నువ్వే మ్యూజిక్‌ చేస్తున్నావని చెప్పారు. నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్‌ని. రవితేజ గారి సినిమాకి పని చేయడం డ్రీమ్‌ కం ట్రూ మూమెంట్‌.
ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు కదా. ?
అవును. నేను రావణాసురలో నాలుగు పాటలు తో పాటు- నేపథ్య సంగీతం చేశాను. భీమ్స్‌ గారు ఒక ఐ-టె-ం పాట చేశారు.
రావణాసురకి స్పెషల్‌ మ్యూజిక్‌ వర్క్‌ ఉందా ?
సినిమా మొత్తం స్పెషల్‌ గా వుంటు-ంది. సుధీర్‌ వర్మగా డిఫరెంట్‌ గా ఆలోచిస్తారు. సౌండింగ్‌ కొత్తగా వుండాలని ఎదురుచూస్తారు. రావణాసుర కి వర్క్‌ చేయడం ఛాలెజింగా అనిపించింది.
రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
రవితేజ గారితో పని చేయడం గ్రేట్‌ ఎక్స్‌ పీరియ న్స్‌. వెయ్యినొక్క జిల్లాల వరకు రీమిక్స్‌ చేసినప్పుడు ఒక చోట స్ట్రింగ్‌ వాయిద్యం వాడను. రవితేజ గారు అక్కడ విజల్‌ సౌండ్‌ వాడితే బావుంటు-ందని చెప్పారు. నిజంగా అది చాలా బాగా వర్క్‌ అవుట్‌ అయ్యింది. సినిమా థీమ్‌ గ్లింప్స్‌ లో కూడా విజల్‌ వుంటు-ంది. అలా అది గొప్పగా కనెక్ట్‌ అయ్యింది.
వెయ్యినొక్క జిల్లాల పాట రీమేక్‌ చేయడం ఎలా అనిపించింది ?
ఇళయరాజా గారి పాటని రీమిక్స్‌ చేయడం ఒక సవాల్‌ తో కూడుకున్నది. కష్టంతో కూడుకున్న పని. రాజా గారు దీనిని మేజర్‌ స్కేల్‌ లో చేశారు. నేను రవితేజ గారి ఇమేజ్‌ ని దృష్టిలో పెట్టు-కొని మైనర్‌ స్కేల్‌ లో ఒక ట్యూన్‌ చేశాను. అది అందరికీ నచ్చింది.
సుధీర్‌ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
సుధీర్‌ వర్మ గారు సౌండ్‌ విషయంలో చాలా కచ్చితంగా వుంటారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ-గా వుంటారు. రెగ్యులర్‌ గా కాకుండా డిఫరెంట్‌ గా అడుగుతారు.
రవితేజ గారు అంటే మాస్‌.. కానీ రావణాసుర థ్రిల్లర్‌.. ఈ రెండింటినిఎలా బ్యాలెన్స్‌ చేశారు ?
సినిమాలో ఈ రెండూ అద్భుతంగా కుదిరిరా యి. కథ బావుంటే ఆటోమేటిక్‌గా మ్యూజిక్‌ ప్లnో అవుతుంది.
అర్జున్‌ రెడ్డితో వచ్చిన ఫేం ఉపయోగించుకున్నారా ?
అర్జున్‌ రెడ్డి నా కెరీర్‌ కి పాత్‌ బ్రేకింగ్‌ ఫిల్మ్‌. అర్జున్‌ రెడ్డి తర్వాత జార్జ్‌ రెడ్డిలో మంచి మ్యూజిక్‌ చేసే అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా రావణాసుర నన్ను మరో మెట్టు- ఎక్కిస్తుందని నమ్ముతున్నాను.
మీ బలం పాటలా.. నేపథ్య సంగీతమా ?
రెండూ. నిజానికి నేను పాటలే ఎక్కువ కంపోజ్‌ చేసేవా డిని. అర్జున్‌ రెడ్డి తర్వాత మాత్రం రివర్స్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement