తాను అక్కినేని వారసుడిగా కంటే అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తానన్నారు యంగ్ హీరో. అప్పుడే ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతారు.. అది నాకు సంతోషమే.అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే.. అదే మూసలోకి వెళ్ళిపోతాను.. ఇక నేను నా సొంత నిర్ణయాలను తీసుకుంటాను.. సక్సెస్ వచ్చినా.. ఫెయిల్యూర్ వచ్చినా.. చివరిదాకా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తానే తప్ప అక్కినేని అనే బిరుదు పొందడానికి మాత్రం నేను ఇష్టపడను అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే అఖిల్ చేసిన ఈ కామెంట్లకు కొంతమంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నా.. మరికొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. జీవితాన్ని ఇచ్చిన వంశవృక్షాన్ని నువ్వు కాదనుకుంటున్నావు తర్వాత కష్టపడతావు అంటూ హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై ఆయన అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది .ఇకపోతే తాజాగా అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్ ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ,టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఖచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.