Friday, November 22, 2024

Rashimikha :ఆ విష‌యంలో ర‌ష్మిక మంద‌న్న తెగ బాధ‌ప‌డిపోతుంది…

స్టార్ హీరోయిన్ గా పలు భాషల సినిమాల్లో ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకుని వాటిని సక్సెస్ లు గా మలుచుకుంటూ ఎందరో ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతున్నారు యువ అందాల హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. దేశవ్యాప్తంగా ఆడియన్స్ మనసుని దోచిన రష్మిక చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజక్ట్స్ ఉన్నాయి.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న క్ర‌ష్ తాను షూటింగ్స్ ఎక్కువ ఉండడం వలన ట్రావెలింగ్ ని ఎంతో మిస్ అవుతున్నాని వాపోయింది.అంతే కాకుండా దీనిపై త‌న అభిమానుల‌కు ఓ స‌ల‌హా కూడా ఇచ్చేసింది..” ట్రావెలింగ్ చేసే వారికి ఒక చిన్న విషయం, ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే మీ ట్రావెలింగ్ డెస్టినేషన్ ని నిర్ణయించుకోండి. అది ఎక్కడికైనా సరే, మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి. ఒంటరిగా లేదా కుటుంబంతో ఎక్కడైనా ఏదైనా కానీ ప్రయాణం చేయండి. దాని వలన కొంత లోక జ్ఞానం తెలుస్తుంది, మరీ ముఖ్యంగా పలు ప్రాంతాల్లోని విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలు వంటివి తెలుస్తాయి” అంటూ రష్మిక పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement