Friday, November 22, 2024

రోజుకి ఎన్ని సిగరెట్లు ?… రష్మికకు నెటిజన్ ప్రశ్న

సోషల్ మీడియలో హిరోయిన్ రష్మిక మందన ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు నెటిజన్స్ వేసే తిక్క తిక్క ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంటారు. కాని ఈ సారి ఓ ఔత్సాహికుడు పాపం రష్మికను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం ఉండరని కూల్ గా రిప్లై ఇచ్చింది.

ఈ ప్రశ్నకు రష్మిక సీరియస్ అవ్వలేదు. తను సిగరెట్లు తాగనని ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. అంతేకాదు, తన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ తాగినా తనకు నచ్చదని అంటోంది. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా షేర్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. రష్మికకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6 భాషలు వచ్చంట. 6 భాషల్లో తను మాట్లాడగలనని చెబుతోంది. ఇక హీరోయిన్ కు ఫిట్ నెస్ ముఖ్యమా ఎక్స్ ప్రెషన్ ముఖ్యమా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. రెండూ కాదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని తెలిపింది. ఇక కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ గురించి చెప్పమని ప్రశ్నించగా ఆయన అద్భుతమైన నటుడని, అతనితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: మనుషులుపై సిగ్గు గా ఉంది…రష్మీ ఆవేదన

Advertisement

తాజా వార్తలు

Advertisement