Monday, June 24, 2024

ర‌ష్మిక… దిల్ కా ధ‌డ్ ఖ‌న్….

రష్మిక మందన్న గ్లామర్ తోనే కాకుండా నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రష్మిక జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తక్కువ బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు, కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటూ తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తోంది.

బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొందరగానే అక్కడ కూడా పెద్ద విజయాలను చూసిన రష్మిక, ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. అంతేకాదు, పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా పాల్గొంటూ తన పేరు, ప్రఖ్యాతిని పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది.

రీసెంట్ గా శ్రీవల్లి వర్కౌట్ చేసిన తరువాత ఓ రెండు ఫొటోలు అలా వదిలింది. ఇక అందులో ఫిట్నెస్ తోనే షాక్ ఇచ్చింది. ఇక కొంటెగా నవ్వుతూ హార్ట్ మెల్ట్ అయ్యేలా చేసిందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రష్మిక ఈ ఫోటోలలో గ్లామర్ తో పాటు సింపుల్ గా క్యూట్ గా కనిపిస్తూ, అభిమానులను ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement