బాలీవుడ్ లో మాధురి ధీక్షిత్, కరిష్మా కపూర్ తర్వాత మళ్లీ ఆ రేంజులో పాపులరైన మేటి ప్రతిభావని రాణీ ముఖర్జీ. అందానికి అందం ప్రతిభతో రాణీ కుర్రకారు కలల రాణి అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే, నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం సాగించిన రాణీ ముఖర్జీ అటుపై అతడితో లవ్ లైఫ్ లో పూర్తిగా సెటిలైంది. ఇప్పుడు తన కిడ్స్ పెంపకం వగైరా సంసార బాధ్యతలతో రాణీజీ బిజీ. రాణీజీ ఇటీవల తిరిగి నటిగా పునరాగమనం చేసారు.
మిసెస్ ఛటర్జీ vs నార్వే చిత్రంతో ఓటీటీలో తన అభిమానులను అలరించారు. ఇందులో దేబికా ఛటర్జీ పాత్రలో రాణీ నటించి మెప్పించారు … ఇక సోషల్ మీడియాల్లో రాణీ ముఖర్జీ అందమైన ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా టైమ్ లెస్ బ్యూటీ రాణీజీ బ్లాక్ సూట్ లో అందంగా కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఫియర్ లెస్, దట్స్ హెర్ స్టైల్ అన్న క్యాప్షన్ తో ఈ ఫోటోలను రాణీజీ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.