టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి రానాకు పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన హిరణ్యకశ్యప మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రానానే ఆ చిత్రాన్ని నిర్మించనున్నారు. అలాగే, హిరణ్యకశ్యప పాత్రను చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మరో మూవీ చేసేందుకు దగ్గుబాటి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెతుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ సినిమా (తలైవర్ 170)లో రానా నటించనున్నారు. ఈ విషయంపై ఇవ్వాల (అక్టోబర్ 3) అధికారిక ప్రకటన వచ్చింది.
జైభీమ్ మూవీ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తలైవర్ 170 తెరకెక్కనుంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా భాగస్వామ్యం అవుతున్నారంటూ తాజాగా సోషల్ మీడియా వేధికగా లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. అలాగే, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఈ అప్ కమింగ్ మూవీలో ఓ పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఫాహద్ మంచి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప మూవీతో టాలీవుగ్ ఎంట్రీ కూడా ఇచ్చారు.
ఇక తలైవర్ 170 సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దసరా విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ తలైవర్ 170లో కీలకపాత్రలు పోషించనున్నారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తారని తెలుస్తోంది.