Saturday, November 23, 2024

రామ‌బాణం ఒక పండుగ‌లా ఉంటుంది…

గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్‌ కలయికలో వస్తున్న సినిమా ‘రామబాణం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీ-జీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహా నిర్మాత. డింపుల్‌ హయతి కథానాయిక . మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం నిర్వహించింది.
తొలుత హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ ” ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చి సినిమాని గ్రాండ్‌ గా నిర్మించారు. శ్రీవాస్‌ గారితో లక్ష్యం, లౌక్యం చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు లక్ష్యం, లౌక్యం లా ఫ్యామిలీ ఎంటర్‌ -టైనర్‌ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర వున్న కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మధు, అబ్బూరి రవి గారు కూడా ఈ కథకు చాలా హెల్ప్‌ చేశారు. డింపుల్‌ చాలా చక్కగా నటించింది. మిక్కీ జే మేయర్‌ తో చేయడం ఇదే మొదటిసారి.” అన్నారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ స్కిప్ట్ర్‌ వర్క్‌, హార్డ్‌ వర్క్‌, టీ-ం వర్క్‌ అన్నీ కలిపి రామబాణం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఈ సినిమా అవుట్‌ పుట్‌ చూశాక చాలా నమ్మకంగా అనిపి చింది. రామబాణంను ఇంత గ్రాండ్‌ స్కేల్‌ లో చేయడానికి పూర్తి సహకారం అందించిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్‌ గారికి, వివేక్‌ గారికి కృతజ్ఞతలు. అన్నారు
డింపుల్‌ హయతి మాట్లాడుతూ.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, గోపీచంద్‌ గారు, శ్రీవాస్‌ గారి హ్యాట్రిక్‌ మూవీ రామబాణంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తు న్నాను. అన్నారు. వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ.. ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. గోపీచంద్‌ గారి యాక్షన్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కూడా రామబాణం ఒక పం డగలా వుంటు-ంది. ” అన్నారు. మధు మాట్లాడుతూ ఓ కొత్త కాన్ఫిప్లిnక్ట్‌తో వచ్చిన అన్నదమ్ముల కథ రామబాణం. ఈ సిని మాలో అన్నీ ఎలిమెంట్స్‌ అద్భుతంగా కుదిరాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. మే 5న అందరూ థియేటర్‌ లో ఎంజాయ్‌ చేయండి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement