టాలీవుడ్లో ఈ మధ్య చాలా మంది యంగ్ హీరోలు బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి.. ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మూడేళ్ల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి చేసుకోవాల్సిన బ్యాచిలర్ బాబులు కూడా చాలామందే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఒకరు. అయితే.. ఇప్పుడు రామ్ తన గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
దీనికి.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందరి సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఇదివరకు ఇట్లనే రామ్ పెళ్లి గురించి వార్తలు రాగా.. పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదని, జరగాల్సిన టైమ్‌లో జరుగుతుందని చెప్పుకొచ్చారు లవర్ బోయ్.. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే ఉందా అని చాలామంది రామ్‌ని క్వశ్చన్ చేస్తున్నారు.
ఇక.. రామ్ నటిస్తున్న ‘వారియర్’ సినిమా రిలీజ్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా.. రామ్ ప్రేమిస్తున్న అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ పెళ్లి వార్తలపై రామ్ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘వారియర్’ సినిమాలో నటిస్తున్న రామ్ దీని తర్వాత బోయపాటి డైరెక్షన్లో మరో యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.