వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసిన వర్మ ఇటీవల కాలంలో అటువంటి హిట్ సినిమాలను తీయలేకపోయాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తన 35 ఏళ్ళ సినీ కెరీర్ లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పుకొచ్చాడు వర్మ. నేను సినిమాలు, వెబ్ సిరీస్ ల తో బిజీగా ఉన్నాను. నాకు పని అతిపెద్ద సెలవు. నేను కుటుంబంతో గడిపే వ్యక్తిని… కాను నాకు చాలామంది స్నేహితులు కూడా లేరు అంటూ చెప్పుకొచ్చారు వర్మ. ఇదిలా ఉండగా తన సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా వర్మ మాత్రం సినిమాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాదు తన సినిమాలు ఎవ్వరూ చూడవలసిన అవసరం లేదని కూడా ప్రకటించిన ఒకే ఒక దర్శకుడు కూడా వర్మనే.