పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఎంత చేయాలో అంత చేస్తాడు. కేవలం నటన పరంగానే కాకుండా కథల ఎంపికలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. కొత్తగా ప్రయోగాలు చేయడం పాత్రం కోసం దేహాన్ని మార్చుకోవడంలో టాలీవుడ్ లో రామ్ చరణ్ కి మరెవరు సాటిరారు. కథతో పాటు తన గెటప్ కూడా కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు హీరో రామ్చరణ్. దానికోసం ఆయన పడే కష్టం అంతాఇంత కాదు. ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజు జిమ్ లో కష్టపడుతుంటాడు చెర్రీ..తాజాగా వైరల్ అయిన ఫోటోనే అందుకు నిదర్శనం. స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ రామ్చరణ్ ఓ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో కండలు తిరిగిన బాడీతో నయా లుక్లో రామ్చరణ్ లుక్ అదరగొడుతోంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.