చెన్నైలోని హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. . . ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో ఆయన సోమవారం రాత్రి హాస్పటల్ లో చేరారు.. మంగళవారం నాడు యాకు కి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు వైద్యులు. ఇక నేడు హాస్పటల్ వర్గాలు హెల్తు బులిటిన్ విడుదల చేశారు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని వైద్యులు ప్రకటించారు…
మోదీ పరామర్శ
కాగా రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. రజనీ భార్య లతాతో ప్రధాని ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ఇక రజనీకాంత్‌ను ఫోన్లోఎపి సీఎం చంద్రబాబు కూడా పరామర్శించారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్‌హాసన్ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. హీరో విజయ్ కూడా రజనీకాంత్ త్వరగా ఇంటికి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు.