బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి స్ర్కీన్ ని షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్ 170వ చిత్రానికి రంగం సిద్ధమయింది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 170వ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత మరోసారి అమితాబ్ తో కలిసి రజనీ స్క్రీన్ పంచుకోనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు, తారాగణం డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు. గతంలో సూపర్ స్టార్స్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి ఓ చిత్రంలో నటించారు. 1991లో రిలీజ్ అయిన బాలీవుడ్ బిగ్గీ ‘హమ్’లో ఇద్దరూ బిగ్ స్క్రీన్ పై అలరించారు. దాంతర్వాత ఇప్పుడు వీరిద్దరూ 32 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్క్రీన్ కాంబినేషన్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తలైవర్ 170తో బిగ్ స్క్రీన్ పైకి రాబోతున్నారు. ఈ సినిమా ఇంటెన్స్ డ్రామాగా ఉంటుందని, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.