Friday, September 20, 2024

Coolie | ద‌ళ‌ప‌తి దేవా మ‌ళ్లీ వ‌చ్చాడు…

రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రం కూలీలో న‌టిస్తున్నారు. మేక‌ర్స్ ఇప్పుడు సినిమాలోని అతని పాత్ర పేరు దేవా అని వెల్లడించారు. లోకేశ్ కనగరాజ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూలీలో దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. ఇందుకు చాలా ధన్యవాదాలు సార్.

ఇది బ్లాస్ట్ అవుతుంది అని వ్యాఖ్య‌ను జోడించారు పోస్ట‌ర్ లో ర‌జ‌నీ లుక్ ఫ్యాన్స్ లో పూన‌కాలు పుట్టించింది. ఆస‌క్తిక‌రంగా మ‌ణిర‌త్నం ద‌ళ‌ప‌తి మూవీలో ర‌జ‌నీ పాత్ర పేరు దేవా. అదే పేరును ఇప్పుడు కూలీ పాత్ర‌కు లోకేష్ ఎంపిక చేసారు. అలాగే ద‌ళ‌ప‌తి చిత్రంలో మమ్ముట్టి పాత్ర పేరు సూర్య‌. ఇప్పుడు కూలీలోను మ‌మ్ముట్టికి అదే పేరు పెట్టారు. రజనీకాంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనేది టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement