సూపర్‌స్టార్ రజినీకాంత్ హిమాలయాల పర్యటనల్లో ఉన్నారు. ఆయనకు అధ్యాత్మిక భావాలు ఎక్కువనే విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు హిమాలయ్యాల్లో గడిపారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, కరోనా వల్ల ఆయన హిమాలయాల సందర్శనకు వెళ్లలేదని అంటున్నారు
తాజాగా హిమాలయాల్లో స్నేహితులతో కలిసి పర్యటిస్తున్నారు. ఓ వంతెనపై స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫోటోలో తెలుపు కుర్తా, పైజామా, నుదుడిపై బొట్టు పెట్టుకుని రజినీ కనిపిస్తున్నారు.
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చింది.