Friday, November 22, 2024

పెళ్లి కి రెడి అవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో ?

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ ప్రస్తుతం చాలా కాలం నుంచి సరైన హిట్ లేక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. అదే పెళ్లి విషయమట. రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.

ఈ సంవత్సరం చివరి నాటికి వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందట. అంతే కాకుండా రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి మారినట్లు సమాచారం. వివాహం తర్వాత తన ఫ్యామిలీతో ఇక్కడే స్థిరపడాలని రాజ్ తరుణ్ ప్లాన్ చేసుకుంటున్నాడట. కాగా ఈ విషయంపై ఎక్కడ కూడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కాకపోతే సన్నిహితులు మాత్రం వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement