Tuesday, November 19, 2024

రాజ్ కుంద్రాకు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగింపు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయిన బాలీవడు నటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో రాజ్‌కుంద్రాను 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించింది. పోర్నో గ్ర‌ఫిక్ సినిమాలు తీసి ప‌లు యాప్‌లలో వాటిని అప్ లోడ్‌ చేసిన కేసులో రాజ్ కుంద్రాను జులై 19న అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జూలై 27వ తేదీ వ‌ర‌కు పోలీసు క‌స్ట‌డీలోకి పంపారు. అయితే రాజ్ కుంద్రా త‌ర‌పు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించ‌బోతున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ దరఖాస్తు విచారణ రేపు జరుగనుంది. మ‌రోవైపు కుంద్రా కేసుకు సంబంధించి పూన‌మ్ పాండే, షెర్లిన్ చోప్రాల‌కు ముంబై హైకోర్టు యాంటిసిపేట‌రి (ముంద‌స్తు బెయిల్‌) బెయిల్ ను మంజూరు చేసింది. సెప్టెంబ‌ర్ 20, 2021 వ‌ర‌కు పూన‌మ్‌, షెర్లిన్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని నిర్దేశించింది. రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ సంబంధిత‌ కేసులో షెర్లిన్ చోప్రా మంగ‌ళ‌వారం ప్రాప‌ర్టీ సెల్ ఎదుట హాజ‌రు కావాల్సి ఉంది. దీంతోపాటు త‌న‌ది అక్ర‌మ అరెస్ట్ గా పేర్కొంటూ రాజ్ కుంద్రా వేసిన పిటిష‌న్ పై ఇవాళ హైకోర్టులో మ‌ధ్యాహ్నం 2.30 విచార‌ణ జ‌రుగనుంది.

ఇది కూడా చదవండి: ఆగస్టు నుంచి పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్: కేంద్ర ఆరోగ్య శాఖ..

Advertisement

తాజా వార్తలు

Advertisement