Friday, October 4, 2024

Raai Lakshmi | సిమ్మింగ్ పూల్ లో బుక్ రీడింగ్..

రాయ్ లక్ష్మి టాలీవుడ్ కి దూర‌మై ఐదేళ్లు అవుతుంది. కంబ్యాక్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది గానీ ప‌న‌వ్వ‌లేదు. టాలీవుడ్ అనే కాదు.. కోలీవుడ్.. శాండిల్ వుడ్.. మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇక హాట్ హాట్ ఫోటోల‌తో హీటెక్కించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఇది రాయ్ ల‌క్ష్మిలో మొద‌టి నుంచి ఉన్న క్వాలిటీ.

సినిమాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్నా.. ఇంకా యూత్ లో అటెన్ష‌న్ డ్రా చేస్తుందంటే… కార‌ణం ఆరక‌మైన ఫాలోయింగ్ అన్న‌ది చెప్పొచ్చు. తాజాగా అమ్మ‌డు స్విమ్మింగ్ పూల్ నుంచి ఓ హాట్ ఫోటో వ‌దిలింది. ఇందులో అమ్మ‌డు రెడ్ అండ్ వైట్ కాంబినేష‌న్ పీస్ లు ధ‌రించి పూల్ మ‌ధ్య‌లో బుక్ ప‌ట్టుకుని సీరియ‌స్ గా చ‌దివేస్తుంది.

చ‌ద‌వ‌డంలో ఆ సీరియ‌స్ చూసి ఈవిడేమైనా బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుందా? అన్న డౌట్ రావ‌డం సహజం. అలా అనుకుంటార‌నే అమ్మ‌డు ఈ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చేసింది. నా జీవితంలోని ఈ అధ్యాయాన్ని ఆనందం అంటారు అని రాసుకొచ్చింది. అంటే ఈత కొల‌నులో ఇలా రిలాక్స్ అవుతోన్న స‌మ‌యంలోనే అమ్మ‌డు అంత ఆనందంగా ఉంటుంద‌ని..మిగ‌తా క్ష‌ణాల‌న్నీ లైఫ్ బిజీ టెన్ష‌న్ లోనే ఉంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement