తొలి చిత్రం ‘డీజే టిల్లు’ సినిమాతోనే ఆకట్టుకుంది నటి నేహాశెట్టి. ఈ కన్నడ భామ అందులో గ్లామర్ పాత్ర కాకుండా అభినయాన్ని ప్రదర్శించే చాన్స్ కొట్టేసింది. రాధికగా మెప్పించింది.
చిత్ర విజయంలో భాగస్వామ్యమైంది. హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డకు ఎలాంటి పేరు వచ్చిందో అంతటి గుర్తింపు నేహా శెట్టికి వచ్చింది. మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్న ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. ‘డిజేటిల్లు’ తర్వాత ‘బెదురులంక 2012’, ‘రూల్స్రంజన్’ చిత్రాల్లో నటించింది. తను మంచి డాన్సర్ అని కూడా నిరూపించుకుంది. ప్రస్తుతం విష్వక్ సేన్‌తో కలిసి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తున్నది.. గ్లామర్ షోకి అభ్యంతరం లేకపోవడంతో అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి.