Friday, November 22, 2024

కరోనా బాధితుల కోసం రాధేశ్యామ్ నిర్మాతలు హెల్పింగ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడే ఆక్సిజన్, బెడ్స్ కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది సినీహీరోలు, దర్శకులు, నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేస్తున్నారు. కాగా రాధే శ్యామ్ చిత్ర నిర్మాతలు కూడా తమ వంతు సహాయం చేశారు. 50 కస్టమ్ పడకలు.. స్ట్రెచర్లు.. వ్యక్తిగత రక్షణ పరికరాలు.. వైద్య పరికరాలు .. ఆక్సిజన్ సిలిండర్ల తో మొత్తం సెట్ ఆస్తిని విరాళంగా ఇచ్చారు.

కొన్ని వారాల క్రితం పీరియడ్ డ్రామా కోసం వారు ప్రత్యేకంగా నిర్మించిన హాస్పిటల్ సెట్ మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చారు. ఇటలీలో 1970 కాలాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్ ను తయారుచేశారు. రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తయినందున మేకర్స్ నగరంలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కూల్చివేసి.. ఆ ఆస్తిని హైదరాబాద్ శివార్లలోని వారి గిడ్డంగికి సురక్షితంగా రవాణా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement