Friday, November 22, 2024

రారా పెనిమిటి అంటున్న నందిత‌….

భర్త రాక కోసం.. భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్‌ క్యారక్టర్‌తో రూపొందిన చిత్రం ‘రారా పెనిమిటి’. సింగిల్‌ క్యారక్టర్‌గా నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మాత. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో ప్రీ – రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించారు. సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ ”దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడు థ్యాంక్స్‌ చెప్పాలి. నేను నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా నటించింది” అన్నారు.

హీరోయిన్‌ నందిత శ్వేత మాట్లాడుతూ ” దర్శకుడు కథ చెప్పి…సింగిల్‌ క్యారక్టర్‌ అనగానే … ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి క్యారక్టర్‌ చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఫస్ట్‌ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కొత్తగా పె్లళన అమ్మాయి..తన భర్త రాక కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్‌ ఈ పాత్రలో ఉన్నాయి. ” అన్నారు.
గాయని హరిణి ఇవటూరి మాట్లాడుతూ మణిశర్మ గారి కెరీర్‌ లోనే బెస్ట్‌ కంపోజిషన్‌ గా రూపొందిన పాటను నేను పాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది అన్నారు. దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ ”కొత్తగా పె్లళన అమ్మాయి..తన భర్త రాకోసం ఎదరు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. తన భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సింగిల్‌ క్యారక్టర్‌ తో రూపొందిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యం లో నడిచే కథ కాబట్టి..ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని… చాలా మందిని సెర్చ్‌ చేశాక నందిత గారైతే పర్ఫెక్ట్‌ అని తీసుకున్నాం. అష్ట లక్షణాలున్న పాత్రను చాలా ఈజీగా చేసింది. సింగిల్‌ క్యారక్టర్‌ అయినప్పటికీ హీరోయిన్‌ తో పలు పాత్రలు ఫోన్‌ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తణికెళ్ల భరణి, సునీల్‌, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీ-నటు-లు డబ్బింగ్‌ చెప్పారు.” అన్నారు.
ఇంకా సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు , పాటల రచయిత డా. డి.నీలకంఠరావు తదితరులు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement