Friday, October 18, 2024

KBC లో అల్లు అర్జున్ ప్ర‌శ్న…

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ఉన్న టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఈ షోలో భాగంగా ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవన్ కల్యాణ్ గురించి కంటెస్టెంట్‌కు ఓ ప్రశ్న వేసిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఇదే షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అమితాబ్ బ‌చ్చ‌న్‌ ఓ ప్రశ్నను అడిగారు. ‘2023లో జాతీయ ఉత్త‌మ నటుడు అవార్డు గెలుచుకున్న యాక్ట‌ర్‌ ఎవరు?’ అనేది ఆ ప్ర‌శ్న‌. దానికి కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం చెప్పారు. దాంతో రూ.20 వేలు గెలుచుకున్నారు.

కాగా, బ‌న్నీ గ‌తేడాది ‘పుష్ప’ సినిమాలో న‌ట‌న‌కు గాను నేషనల్‌ అవార్డు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప సీక్వెల్ ‘పుష్ప‌-2’ తెర‌కెక్కుతోంది. డిసెంబ‌ర్ 6న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement