ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం బాల్య వివాహాల పేరిట జరిగే బాలికల అక్రమ రవాణాను తెలిపేలా కుబూల్ హై? వెబ్ సిరీస్‌ను విడుదల చేయనుంది. నేటి నుంచి ఆహా ప్లాట్ ఫాం సిరీస్ ప్రసారం కానుంది. ఈ విషయమై రూపకర్త ప్రణవ్ పింగళ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగే బాల్య వివాహాల ఆధారంగా కథను రూపొందించామన్నారు. ఉమర్ హుస్సేన్ , ఫైజ్ రాయ్ లతో కలిసి దర్శకతం వహించామని వివరించారు.
నేడు సినీ నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా ప్లాట్ ఫాంపైకి కుబూల్ హై? విడుదల కానుందని వెల్లడించారు. టీసానియా మీర్జా, ఆర్కే మీడియా వర్క్స్ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ, దర్శకురాలు నందినిరెడ్డి, మేయర్ గదాల్ విజయలక్ష్మి నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. 13 ఏళ్ల బాలికలు విదేశి షేక్‌లను పెండ్లి చేసుకొని వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలపడమే సిరీస్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..