Thursday, October 24, 2024

Pushpa 2 | ఒకరోజు మందే వచ్చేస్తున్న పుష్ప‌…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్.. తెరకెక్కిస్తున్న మ‌చ్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ “పుష్ప 2”. భారీ అంచనాలున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప‌లుమార్లు వాయిదా పడి… ఎట్టకేలకు డిసెంబర్ 6న ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చారు మేకర్స్. ఈసారి విడుదల తేదీని ప్రీపోన్ చేస్తూ… కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

నేడు జరిపిన నేషనల్ ప్రెస్ మీట్ లో పుష్ప 2 సినిమాని డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అదిరే పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో బన్నీ సాలిడ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ టేకోవర్ డిసెంబర్ 5 నుంచి ఉంటుంది అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement