Tuesday, November 19, 2024

లైగర్​ డిజాస్టర్​తో జనగణమనకు బ్రేక్​.. #JGM ప్రాజెక్టును ఆపేసిన పూరీ!

రౌడీ బొయ్ విజయ్ దేవరకొండ హీరో నటించిన లైగర్ మూవీ ఊహించని పరాజయం చెందడంతో మేకర్స్‌ షాక్‌కి గుర‌య్యారు. ఆగష్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత ఆక‌ట్టుకోలేదు. థియేట్రికల్ రన్‌ను దాదాపు ముగించేస్తున్న లైగర్, దానిపై పెట్టిన ఖర్చును తిరిగి పొందడంలో చాలా దూరంలో ఉంది. లైగర్ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మారడంతో విజయ్ దేవరకొండ, ఛార్మి కౌర్ సహ నిర్మాతలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ లైగర్ కోసం తన రెమ్యునరేషన్‌లో ఎక్కువ భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇవ్వాలని ప్లాన్ చేసాడు. నిర్మాతలకు నష్టాల భారం తగ్గించేందుకే ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దాదాపు 6 కోట్లకు పైగా నిర్మాతలకు తిరిగి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు, విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ క‌లిసి చేప‌డుతున్న తదుపరి ప్రాజెక్ట్ ‘‘జన గణ మన’’ లైగర్ ఎఫెక్ట్​ పడే చాన్సెస్​ ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే జన గణ మన బడ్జెట్ గణనీయంగా తగ్గింది. విజయ్, పూరీ జగన్నాధ్ ఇద్దరూ ఈ సినిమా కోసం తమ రెమ్యునరేషన్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. లైగర్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన కారణంగా నష్టాన్ని భర్తీ చేయడానికి ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టె తెలుస్తోంది.

నటుడు-దర్శకుడు కాంబోలొ ఈ సంవత్సరం చివర్లో మొరాకో షెడ్యూల్‌ను ప్రారంభించడానికి ముందు, JGM కోసం స్క్రిప్ట్‌ను మళ్లీ ప‌రీశీలించాల‌ని చూస్తున్నారు. 100 కోట్లకు పైగా వెచ్చించిన “లైగర్”కి భిన్నంగా సినిమా బడ్జెట్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. “లైగర్” భారీ పరాజయం తరువాత, పూరి జగన్నాధ్ ప్రస్తుతానికి “JGM” ని నిలిపిసిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement