హిందీలో ‘మైనే ప్యార్ కియా’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి భాగ్యశ్రీ. ‘ప్రేమ పావురాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’లో , రాజశేఖర్ నటించిన ‘ఓంకారం ‘ సినిమాలో నటించింది. సుమారు రెండు దశాబ్దాల తరవాత తాజాగా ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రభాస్‌కి తల్లిగా నటిస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భాగ్యశ్రీ మీడియాతో ముచ్చటించారు.
నేను మళ్లి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు మొదటి సారిగా తలైవి, రాధేశ్యామ్ సినిమాలో యంగ్ మదర్ క్యారెక్టర్ చేయమని రెండు సినిమాల దర్శకులు వేరు వేరుగా కథలు చెప్పడం జరిగింది. రెండు సినిమాలు ఒకే సారి మొదలైనా కూడా ప్యాండమిక్ వలన రాధే శ్యామ్ ఆలస్యమైంది. ప్రభాస్‌కు తల్లిగా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యు.వి.క్రియేషన్స్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో సినిమా తీశారు.
మైనే ప్యార్ కియా తరువాత నేను కొన్ని సినిమాలు చేశాను. ఆ టైంలో ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుందని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఫ్యామిలీతో బిజీగా ఉన్నందున సినిమాలకు దూరం అయ్యాను. ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయినందున మా భర్త, పిల్లలు సినిమాలలో నటించమని ప్రోత్సాహించడంతో మళ్లి నటించేందుకు ముందుకు వచ్చాను తెలుగు సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. ఇవాళ బాలీవుడ్ తో ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. తెలుగులో ఒక్క మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధంగా వున్నాను అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..