నటీనటుల ఎంపికలో రాజకీయాలు ఉండకూడదని ప్రముఖ బాలీవుట్ నటి ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. సినీరంగ పరిణామాలు నిశితంగా పరిశీ లిస్తున్న నాయిక ల్లో ఆమె ఒకరు. కొంతకాలంగా బాలీవుడ్‌లో పరిస్థితులు మారాయి. దేశవ్యాప్తంగా వినోద పరిశ్రమ వృద్ది చెందింది. పదేళ్లలో ఈ మార్పు కనిపిస్తోంది. ప్రతిభావంతులైన నటీనటులు, దర్శకులు, రచయితలు, సాంకేతికనిపుణులు పరిశ్రమకు వస్తున్నారని ప్రియాం చోప్రా అభిప్రాయపడ్డారు. నేను నటిగా కెరీర్ ప్రారంభించిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు. దీనికికారణం మా తరం నటీనటులే అని ఆమె అన్నారు. టాలెంట్ ఆధారంగా నటీనటుల ఎంపికజరగాలి…కానీ రాజకీయాల జోక్యంతో జరుగుతున్నట్టు అనిపిస్తోంది ఆమె ఆవేదన చెందారు. ప్రతిభ, అవకాశాలు దీనిపై విస్త్రత చర్చ జరిగాలని అన్నారు. ఈ రంగంలో విఫలమైనా సరే మరింత కిందకు జారిపడకుండా ముందుకు అడుగువేయాలని ప్రియాంక చోప్రా సూచించారు. ఇదే విషయం తన తల్లిదండ్రులు తనకు నేర్చించారని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement