Friday, November 22, 2024

ఆ త‌ర్వాతే భ‌యం పోయింది..

బాలీవుడ్‌ అగ్రనటి ప్రియాంక చోప్రా (40) తన వ్యక్తిగత జీవితంలో, నట జీవితంలో తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను సందర్భం వచ్చినప్పుడల్లా వెలిబుచ్చుతున్నారు. మిస్‌ వరల్డ్‌గా కిరీటం సొంత చేసుకున్నాక ఆమెకు వెనువెంటనే సినీ అవకాశాలు రాలేదు. 2002లో తమిళ్‌ సినిమా ద్వారా ఆ తర్వాతి సంవత్సరమే హిందీ సినిమా ద్వారా తన కెరీర్‌ ప్రారంభిం చింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రియాంక నటించిన ‘సెటడెల్‌ ‘వెబ్‌సిరీస్‌ విడుదలైంది. ఆదరణ పొందుతోం ది. వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌ లో భాగంగా ప్రియాంక తన విద్యార్థి దశలో ఉండగా ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించింది.

విద్యార్ధిదశలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రియంక తెలిపింది. తొలినాళ్లలో తను బిడియస్తురాలని అంటూ చెప్పు కొచ్చింది. హైస్కూల్‌ విద్య కోసం అమెరికా వెళ్లిన సందర్భంలో ఇబ్బందులు పడినట్టు చెప్పింది. అమెరికాలో అక్కడి వారితో ఎలా మసులుకావాలో తెలిసేది కాదు. క్యాంటిన్‌లో ఫుడ్‌ ఎలా తీసుకోవాలో తెలిసేది కాదు.
వెండింగ్‌ మిషన్‌ నుండి స్నాక్స్‌ తీసుకున్నాక వాటిని ఎవరూ చూడకుండా బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ తినేదానిని అని చెప్పుకొచ్చింది. చాలా రోజులు తోటి విద్యార్థులతో కలువలేకపోయారు. అక్కడి విషయాలు నిశితంగా గమనించి ఆర్థం చేసుకున్నాను. ఆ తర్వాతే భయం పోయింది. నాలో ధైర్యం వచ్చింది అంటూ ప్రియాంక వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement