ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమీత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేక డ్రెస్ ఆమె అందంలో బాగా కలిసిపోయింది. స్టైలింగ్ లో ఆమె స్టిల్ కూడా ఈ అవుట్‌ఫిట్‌కు పూర్తిగా న్యాయం చేసింది.
ఫోటోగ్రాఫర్ పళణియప్పన్ సుబ్రహ్మణ్యం కెమెరాతో తీసిన ఈ ఫొటోస్ బ్యాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ప్రియాంక అందాన్ని హైలైట్ చేస్తున్నాయి. ప్రియాంక మోహన్ తన హుందాతనంతో హృదయాలను గెలుచుకుంటూ పోతున్నారు. ఆమె తన ప్రత్యేకమైన శైలి, అందంతో ప్రతి ఫోటోలోనూ ఒక కొత్తగా కనబడుతున్నారు.
ఈ లుక్‌లో ప్రియాంక లుక్స్ తో పాటు ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ను ప్రదర్శిస్తోంది. ఫ్యాషన్‌కు సంబంధించిన జ్యువెలరీ, ఆరుస్ జ్యూవెల్స్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇందులో స్టైలిష్ కాన్సెప్ట్ తో ఆమె తనకున్న అందాన్ని మళ్లీ రీడిఫైన్ చేసుకున్నారు.