Monday, October 21, 2024

Priyanka Mohan | చీర‌క‌ట్టులో ప్రియాంక మై’మెరుపులు’..

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో అందరి మనసు దోచుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి నాని సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బ్లూ కలర్ చీరలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.

నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్… తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ తరువాత వెంటనే శర్వానంద్ ‘శ్రీకారం’లో కనిపించింది. ఇక అటు తమిళంలో శివ కార్తికేయంతో చేసిన ‘వరుణ్ డాక్టర్’.. డాన్ సినిమాలతో మంచి విజయం అందుకుంది.

ఇక అప్పటినుంచి తమిళంలో వరస అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది ఈ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తుతన్నాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ‘ఓజీ’ మూవీలో ఈ హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement