Friday, November 22, 2024

శరీర ఆకృతి మారడాన్ని స్వీకరించాలి: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా కు మధ్య నెటిజన్ల నుంచి విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆమే శరీర ఆకృతిపై నెటిజన్లు చేసిన కామెంట్స్ ను ఆమే తిప్పికొట్టింది. ప్రియాంక చోప్రా చాలా మెచ్యూరిటీతో సమాధానం ఇచ్చింది. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను మానసికంగా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. శారీరక మార్పులతో తాను ఇబ్బంది పడటం లేదనే అబద్ధాన్ని తాను చెప్పలేనని తెలిపింది. వయసు పెరుగుతున్నందున తన శరీరం చాలా మార్పులకు గురైందని తెలిపింది.

అందరి శరీరాల మాదిరే తన శరీరం కూడా మార్పు చెందుతోందని ఆమె వ్యాఖ్యానించింది. వయసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందేనని… తాను కూడా తన శారీరక మార్పులను స్వీకరిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు తన శరీరం ఇలాగే ఉందని చెపుతూ ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఇప్పుడున్న తన శరీరానికి మాత్రమే తాను తగు జాగ్రత్తలు తీసుకోగలనని… 20 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం శరీరానికి కాదని నెటిజెన్లకు చురకంటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement