తనదైన అందం నటనతో ప్రపంచాన్ని మెప్పించిన మేటి నటి ప్రియాంక చోప్రా. దశాబ్ధం పైగానే బాలీవుడ్లో ఆధిపత్యం చెలాయించడమే కాకుండా హాలీవుడ్‌లోను తన అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసింది. నటనతో పాటు సామాజిక కార్యక్రమాలతోను పీసీ ఖ్యాతి విశ్వవిఖ్యాతం అయింది.
యునిసెఫ్ గ్లోబల్ అంబాసిడర్ గాను పీసీ సేవలందిస్తోంది. హాలీవుడ్ కి వెళ్లాక పీసీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. ఇటీవల కంటెంట్ ఉన్న చిత్రాలతో నిర్మాతగా ఎదిగేస్తోంది. ఇప్పటికే పలు ప్రయోగాత్మక డాక్యు సిరీస్ లు, సినిమాలకు ఆర్థిక మద్ధతును ప్రకటించింది. అకాడమీ అవార్డ్-నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ ‘టు కిల్ ఎ టైగర్’ నుండి ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ వరకు ప్రియాంక ఇటీవల నిర్మాతగా పెట్టుబడులు పెడుతోంది. కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని వాటికి బడ్జెట్లను సమకూర్చడం తన అభిరుచికి నిదర్శనం. ఇప్పుడు బారీ అవ్రిచ్ ‘బోర్న్ హంగ్రీ’ ఈ లిస్ట్‌లో చేరింది. ప్రియాంక చోప్రా ‘బోర్న్ హంగ్రీ’ అనే చిత్రానికి నిర్మాతగా సంతకం చేసింది.
తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ బ్యానర్ బారీ అవ్రిచ్ కొత్త ఫీచర్ డాక్యుమెంటరీ ‘బోర్న్ హంగ్రీ’కి మద్ధతుగా నిలవనుంది. ఈ అప్డేట్ని తన అభిమానులు అనుచరులతో ఇన్ స్టా వేదికగా పీసీ షేర్ చేసారు. ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన దృక్కోణంతో కదిలించే సామర్థ్యం ఉన్న కథలు ఎంచుకునే దర్శకనిర్మాతలతో కలిసి పనిచేయడం కోసం పేబుల్ పిక్చర్స్ వేచి చూస్తుంటుంది. బారీ రిచ్ కొత్త ఫీచర్ డాక్యుమెంటరీ- బోర్న్ హంగ్రీ సరిగ్గా అలాంటిదే.. అని తాజా నోట్ లో రాసింది పీసీ. ఇది అద్భుతమైన కథ. కదిలించే విషయాలు ఉన్నాయని వెల్లడిచింది.